శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : ఆదివారం, 18 నవంబరు 2018 (09:56 IST)

హరికృష్ణ తనయ కాదు నా కుమార్తె : టీడీపీ నేత పెద్దిరెడ్డి

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పోటీ చేస్తోంది. ఈమె శనివారం నామినేషన్ దాఖలు చేసింది. వాస్తవానికి ఈ స్థానంపై టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి బోలెడు ఆశలుపెట్టుకున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన బలంగా పట్టుబట్టారు. 
 
కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ స్థానాన్ని నందమూరి సుహాసినికి కేటాయించారు. దీనిపై పెద్దిరెడ్డి మాట్లాడుతూ, నందమూరి సుహాసిని తనకు కూతురుతో సమానమని, ఆమెను గెలిపించడం తన బాధ్యత అని చెప్పారు. ఎన్నికల బరిలో ఎవరున్నా గెలిపించడం తమ బాధ్యత అని చెప్పారు. 
 
పైగా, తాను కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తానని ఎన్నడూ చెప్పలేదని, అందువల్ల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అభ్యర్థి విషయంలో పార్టీ హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడివుంటానని తెలిపారు. 
 
అంతేకాకుండా, తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతోనే సుహాసిని రాజకీయాల్లోకి వచ్చారని, ఆమెకు ఎలాంటి స్వార్థం లేదని, కేవలం ప్రజాసేవ చేయాలన్న బలమైన ఆకాంక్ష మాత్రమే ఉందన్నారు. కొత్తవాళ్ళకు కూడా అవకాశం కల్పించే చర్యలో భాగంగా సుహాసినికి టిక్కెట్ ఇచ్చినట్టు పెద్దరెడ్డి వివరించారు.