శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (08:05 IST)

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు

హైకోర్టు ఆదేశాలతో విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై సమగ్రమైన మార్గదర్శకాలను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచరాదని, కేవలం ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలని సూచించింది.

ఎవరికైనా కొవిడ్ నిర్ధారణ అయితే వారితో కాంటాక్ట్ ఉన్న వారికి వెంటనే టెస్ట్ చేయించాలని, అలాదగే కొవిడ్ బారిన పడి మరణించిన వారి పిల్లలను ఏ కారణం చేత కూడా ప్రైవేట్ పాఠశాలల నుండి తీసివేయకూడదని పేర్కొంది. విద్యార్థులు ఇంటి వద్ద ఉండి చదువుకుంటామంటే అనుమతి ఇవ్వాలని తెలిపింది.

స్కూల్స్‌కి హాజరు కావాలని ఒత్తిడి చేయకూడదని పేర్కొంది. అలాగే మధ్యాహ్న భోజన సమయంలో భౌతిక దూరం పాటించాలని మార్గదర్శకాలు విడుదల చేసింది.