Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఎక్కడి వారికి అక్కడే

Written By ఎం
Updated: శుక్రవారం, 5 జూన్ 2020 (23:00 IST)
ప్రయివేట్‌ స్కూళ్ల హాస్టళ్లలో ఉండి పదో తరగతి చదువుకున్న ఇతర ప్రాంతాల విద్యార్థులను ఎక్కడి వారిని అక్కడే తమ సొంత ప్రాంతాల్లో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు విద్యార్థుల వివరాలను తమ జిల్లా డిఇఒలకు పంపించాలని ప్రయివేట్‌ స్కూళ్ల యాజమాన్యాన్ని విద్యాశాఖ ఆదేశించింది. ఇదిలా ఉండగా, తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టు విచారణ జరిపింది.

ప్రయివేట్‌ స్కూళ్లు, హాస్టళ్లు తెరిచేందుకు తాత్కాలికంగా అనుమతి ఇస్తామని విద్యాశాఖ హైకోర్టుకు వివరించింది. ఈసారి పరీక్షలు రాయలేని వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రాసుకునే అవకాశం ఇస్తామని తెలిపింది.

దీంతో హైకోర్టు కలగజేసుకుని అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రాసే విద్యార్థులను రెగ్యులర్‌ విద్యార్థులుగా పరిగణిస్తారా? అని ప్రశ్నించింది.

దీంతో ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకుని రేపు చెబుతామని అటార్నీ జనరల్‌ (ఎజి) హైకోర్టుకు తెలిపారు. పరీక్షలు ప్రారంభమైతే ప్రతి ఐదు రోజులకొకసారి నిర్వహణను సమీక్షిస్తామని హైకోర్టు తెలిపింది. 

అన్నీ చూడండి

Vijay Deverakonda: ఆయన పిలిచాక రాకుంటే నేను బతికి ఎందుకు?.. విజయ్ దేవరకొండ ఎమోషనల్

Gautam: గౌతమ్ ఘట్టమనేని కు కుటుంబసభ్యులు, ఫౌండేసన్ శుభాకాంక్షలు

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

తర్వాతి కథనం
Show comments