సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శుక్రవారం, 5 మార్చి 2021 (21:44 IST)

అంకుల్ మీరు నచ్చారన్న టీనేజ్ బాలిక, గర్భవతిని చేసి జంప్

ఏది తప్పో.. ఏది ఒప్పో తెలియని వయస్సు. మొత్తం ఆకర్షణ. ఆ వయస్సులో తెలియని తప్పు చేసింది. తండ్రితో సమానంగా భావించాల్సిన వ్యక్తితో ఏకంగా శారీరక సంబంధం పెట్టుకుంది. గర్భం దాల్చి చివరకు కుటుంబ సభ్యులకు కన్నీటిని మిగిల్చింది.
 
హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన 16 యేళ్ల బాలిక స్థానికంగా డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తన స్నేహితురాలి ఇంటికి తరచూ వెళుతుండేది. ఆమెతోనే కలిసి కళాశాలకు వెళ్లేది. తన స్నేహితురాలి తల్లి అనారోగ్యంతో చనిపోయింది.
 
తండ్రి ఒక్కడే ఉంటున్నాడు. స్నేహితురాలి తండ్రి మాటలకు, అతని అందానికి ఆకర్షితురాలైంది పదహారేళ్ల యువతి. అంకుల్ మీరు అందంగా ఉన్నారంటూ ప్రారంభించింది. ఇంకేముంది కూతురితో సమానంగా ఉన్న యువతిని కూతురుగా భావించాల్సిన ఆ అంకుల్ కాస్త ఆమెతో ప్రేమాయణం సాగించాడు.
 
ఆ ప్రేమాయణం కాస్త శారీరక సంబంధానికి దారితీసింది. మూడు నెలల గర్భవతిని చేసింది. తను గర్భం దాల్చానన్న విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడింది. ఐతే స్నేహితురాలి తండ్రితో తను గర్భవతినని, పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చింది. ఆమె ఒత్తిడికి తలొగ్గిన స్నేహితురాలి తండ్రి ఓకే చెప్పడంతో కాలేజీకి వెళ్లొస్తానని అంకుల్‌తో పాటు పారిపోయింది. మొత్తం విషయాన్ని లేఖ ద్వారా రాసి పెట్టింది. దీన్ని చదివిన కుటుంబ సభ్యులు షాకయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి కోసం గాలిస్తున్నారు పోలీసులు.