ఆదివారం, 3 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (22:23 IST)

సోషల్ మీడియా వద్దు బాబోయ్.. యువీ భార్య హాజెల్.. ప్రెగ్నెంట్‌గా వుందా..?

సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో వుండటం ప్రస్తుతం ఫ్యాషన్. అయితే సోషల్ మీడియాకు కొందరు సెలెబ్రిటీలు దూరంగా వుంటున్నారు. అలాంటి వారిలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ భార్య, బాలీవుడ్ నటి హాజెల్ కీచ్ దూరమయ్యారు. ఈ క్రమంలో తన సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేశారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్‌స్టాగ్రాం ద్వారా వెల్లడించారు. 
 
తాను సోషల్ మీడియా నుంచి కొంత కాలం విరామం తీసుకోబోతున్నట్లు ఆ పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ టెక్నాలజీ ప్రపంచం నుంచి నిజమైన ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాను. తనకు శుభాకాంక్షలు చెప్పండంటూ పోస్టు చేశారు.
 
కొన్నాళ్ల పాటు తన ఫోనుకు దూరంగా వుంటానని.. ఒకరిపై మరొకరు పూర్తిగా ఆధారపడకుండా ఎవరికివారుగా జీవించడం ఎలానో తెలుసుకునేందుకు ఇలాంటి పరిస్థితులు ఉపయోగపడతాయని తెలిపారు. తన నెంబర్‌ వున్నవారు ఎవరైనా తనతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. మెసేజ్‌లు వద్దు. "నేను మళ్లీ తిరిగి వస్తాను. కానీ ఇప్పుడప్పుడే కాదు" అంటూ హెజెల్ కీచ్ తన ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు.
 
 ప్రస్తుతం యువీ భార్య సోషల్ మీడియాకు దూరమయ్యేందుకు కారణం ఏమిటని అందరూ చర్చించుకుంటున్నారు. ఇంకా ఆమె ప్రెగ్నెంట్ అని.. అందుకే సోషల్ మీడియాకు దూరమైందని చర్చించుకుంటున్నారు.