గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (19:36 IST)

బావతో వివాహేతర సంబంధం, భర్తను చంపించిన భార్య

కట్టుకున్న భర్తను హత్య చేయించింది ఓ భార్య. బావతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ మహిళ తన భర్తను అడ్డు తొలగిస్తే ఇద్దరం హాయిగా సంతోషంగా గడపవచ్చని బావను పురిగొల్పి భర్త ప్రాణాలను తీయించింది.
 
వివరాల్లోకి వెళితే... చత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన 35 ఏళ్ల అనిల్ కుమార్ బ్రతుకుదెరువు కోసం పటాన్ చెరు పరిధిలోని సుల్తాన్ పూర్ కి వచ్చాడు. అక్కడే సెంట్రింగ్ పని చేసుకుంటున్నాడు. ఐతే ఇతడి భార్య భువనేశ్వరికి బావ సర్వోత్తంకి మధ్య ఎఫైర్ వుంది.
 
భర్తకు తెలియకుండా ఈ తతంగం నడపడం కుదరడం లేదనీ, భర్తను హత్య చేస్తే ఇద్దరం కలిసి హాయిగా వుండొచ్చని బావతో చెప్పింది. దాంతో అతడు మంగళవారం నాడు పార్కుకి ఆవల వున్న గుట్టల్లోకి తీసుకెళ్లి తలపై బండరాయితో మోది హత్య చేసాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేసాడు.
 
అనిల్ కనిపించకపోవడంతో అతడి స్నేహితులు సర్వోత్తంను నిలదీశారు. ఎవరో బైకుపై ఎక్కించుకుని వెళ్లారంటూ అబద్ధం చెప్పాడు. రాత్రి వరకూ అనిల్ జాడ లేకపోవడంతో గట్టిగా మరోసారి నిలదీయడంతో అనిల్ భార్య అతడిని హత్య చేయమన్నదని నిజం అంగీకరించాడు. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేశారు అనిల్ స్నేహితులు. సర్వోత్తం, భువనేశ్వరిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.