సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (22:15 IST)

షమీతో మళ్లీ సంసారం.. సింధూరంతో హసిన్..? సహనమనే వేలు పట్టుకొని..? (Video)

Hasina
భారత క్రికెటర్ మహ్మద్ షమీ భార్య, ప్రముఖ మోడల్ హసిన్ జహాన్ తాజాగా సింధూరంతో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ''సహనమనే వేలు పట్టుకొని ముందుకు వచ్చాను... నేను ప్రయాణించిన రహదారి ఆశ్చర్యానికి గురి చేసింది''అని హసిన్ జహాన్ సింధూరం పెట్టుకున్న చిత్రంతోపాటు వ్యాఖ్యను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టుతో షమీతో మళ్లీ సంసారం మొదలెట్టిందోననే అనుమానం రాక తప్పదు. 
 
తాజాగా కాగా మహ్మద్ షమీ, జహాన్‌లకు ఐరా అనే కుమార్తె ఉంది. షమీ, హసిన్ జహాన్‌లు 2014 ఏప్రిల్ నెలలో వివాహం చేసుకున్నారు. అనంతరం షమీపై జహాన్ పలు ఆరోపణలు చేశారు. ఇతర మహిళలతో షమీ సంబంధాలు పెట్టుకున్నాడని జహాన్ ఆరోపించారు. హసిన్ జహాన్ తన చిన్ననాడు సైఫుద్దీన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2012లో తన భర్త సైఫుద్దీన్ నుంచి విడిపోయిన జహాన్ షమీని రెండో పెళ్లి చేసుకుంది.