ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (12:47 IST)

వేల కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్: షర్మిల

గరీబుల కోసం మహానేత వైఎ్‌సఆర్‌ ఆలోచించారని, వారి కోసం ఆరోగ్యశ్రీని ప్రవేశ పెట్టారని, తెలంగాణను అప్పుల పాలు చేసి రూ.వేల కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్‌  అని వైఎస్‌ షర్మిల విమర్శించారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు వచ్చి పేదల కన్నీళ్లు చూడాలన్నారు.

కేసీఆర్‌కు ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం లేకనే కార్పొరేటు వైద్యం చేయించుకున్నారని, పేదలు సర్కారు ఆస్పత్రులకు వెళ్లాలని ఎలా చెబుతారని షర్మిల ప్రశ్నించారు.

సర్కారు వైద్యంపై నమ్మకం లేక ప్రాణాలు దక్కించుకునేందుకు చాలా మంది కార్పొరేటు ఆస్పత్రుల్లో చికిత్స పొంది రూ.లక్షలు అప్పులు చేశారని చెప్పారు. ప్రభుత్వాస్పత్రికి వెళ్తే బతుకుతానో లేదోనన్న భయంతోనే సీఎం కేసీఆర్‌ యశోద ఆస్పత్రికి వెళ్లారని విమర్శించారు.

కొవిడ్‌ బారిన పడి అప్పుల పాలైన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. కరోనా చికిత్సను ఆయుష్మాన్‌ భారత్‌లో చేర్చామని సీఎం కేసీఆర్‌ చెబుతున్నారని.. దిక్కుమాలిన పథకమని చెప్పిన మీరే ఆ పథకంలో ఎలా చేర్చుతారని ప్రశ్నించారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం పాఠశాలలను తెరవడం మంచిది కాదని, టీకా పంపిణీని వేగవంతం చేయాలని షర్మిల సూచించారు.