బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (12:27 IST)

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. వరుసగా మూడు రోజులు సెలవులు

tseamcet
తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శుక్రవారం నుంచి వరుసగా మాడు రోజులు సెలవులు వచ్చాయి. శుక్రవారం జమాతుల్ వాద నేపథ్యంలో ఆప్షనల్ హాలిడేను ప్రకటించారు. దీంతో హైదరాబాద్ నగరంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం పాఠశాలలు మూసివేశారు. శనివారం రంజాన్ పండుగ కావడంతో జాతీయ సెలవు దినం. ఆదివారం వారాంతపు సెలవు. దీంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. 
 
ఏపీ ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎంసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గతంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించలేక పోవడంతో ఇంటర్ మార్కుల వెయిటేజీని గతంలో తొలగించారు. ఈ యేడాది అన్ని వార్షిక పరీక్షలను సాఫీగా నిర్వహించారు. దీంతో 25 శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వనున్నారు. ఎంసెట్‌లో వచ్చే మార్కుల్లో 75, ఇంటర్‌ మార్కుల్లో 25 శాతం కలిపి ఎంసెట్ ర్యాంకులను కేటాయిస్తారు.