మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (09:14 IST)

కామారెడ్డి జిల్లాలో కొత్త మండలం ఏర్పాటు..

Kama Reddy
Kama Reddy
పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం కామారెడ్డి జిల్లాలో కొత్త మండలాన్ని ఏర్పాటు చేసింది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పాల్వంచ గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేశారు. ఈ గ్రామం మాచారెడ్డి మండలం నుండి వేరు చేయబడింది. 
 
నోటిఫికేషన్ ప్రకారం పాల్వంచ మండలంలో 10 గ్రామాలు ఎల్పుగొండ, వాడి, ఫరీద్ పేట్, బండ రామేశ్వర్ పల్లి, ఇసాయిపేట్, దేవన్ పల్లి, పోతారం, మరో మూడు గ్రామాలు ఉంటాయి. దీంతో కామారెడ్డి జిల్లాలో మొత్తం మండలాల సంఖ్య 24కి చేరింది.