సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Srinivas
Last Modified: గురువారం, 3 మే 2018 (21:17 IST)

బాక్సర్ నిఖత్ జరీన్‌కు ఎంపీ కవిత అభినందనలు

బాక్సర్ నిఖత్ జరీన్ నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితను బుధవారం హైదరాబాదులోని ఆమె నివాసంలో కుటుంబ సభ్యులతో కలిశారు. ఈ సందర్భంగా జరీన్‌ను ఎంపి కవిత అభినందించారు. ఇటీవల బేలెగ్రేడ్‌లో జరిగిన 56వ అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధ

బాక్సర్ నిఖత్ జరీన్ నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితను బుధవారం హైదరాబాదులోని ఆమె నివాసంలో కుటుంబ సభ్యులతో కలిశారు. ఈ సందర్భంగా జరీన్‌ను ఎంపి కవిత అభినందించారు. ఇటీవల బేలెగ్రేడ్‌లో జరిగిన 56వ అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెల్సిందే. 
 
జరీన్‌తో పాటు అసాముద్దీన్ అంతర్జాతీయంగా తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు సాధించి పెట్టారని ప్రశంసించారు. వీరిద్దరూ నిజామాబాద్‌కు చెందినవారు కావడం నిజామాబాద్ వాసులకు సంతోషకరమైన విషయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, క్రీడాకారులకు అవసరమయిన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నదని ఎంపి కవిత తెలిపారు. వీటిని ఉపయోగించుకుని క్రీడాకారులు తమ నైపుణ్యాలను అభివృద్ధి పర్చుకోవాలని కోరారు.