శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : ఆదివారం, 21 మార్చి 2021 (10:22 IST)

అందరికీ టీకా ప్లీజ్.. కేంద్రానికి ఈటల విజ్ఞప్తి

కరోనా టీకా అందరికీ అందేలా చూడాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహారాష్ట్రలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, అక్కడి నుంచి నిత్యం తెలంగాణకు రాకపోకలు జరుగుతూ ఉంటాయని తెలిపారు.

మహారాష్ట్ర నుంచి వచ్చిన వారితోనే తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి కో మార్బిడిటీస్‌ ఉన్న వారికి, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చామని తెలిపారు.

కానీ, అందరికీ టీకా ఇచ్చినప్పుడు మాత్రమే వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం సాధ్యమవుతుందని చెప్పారు. వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు.
 
రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటే ప్రైవేటు ఆస్పత్రుల్లోనే కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో 20 పడకలు దాటిన అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా వేసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 20 పడకలు దాటిన ప్రైవేటు ఆస్పత్రులు 4000 వేల వరకు ఉంటాయని వైద్య వర్గాలు వెల్లడించాయి.