గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 మార్చి 2021 (09:30 IST)

ఏపీలో టీచర్లకు వ్యాక్సిన్‌!

ఏపీలో ఉపాధ్యాయులు కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. తొలిదశలో 45 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులకు అవకాశం కల్పిస్తోంది. మండలాల వారీ వ్యాక్సిన్‌ కేంద్రాలను వైద్యారోగ్యశాఖ ఇప్పటికే ఏర్పాటు చేసింది.

ఆ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఉపాధ్యాయులు వ్యాక్సిన్‌ తీసుకునేలా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. 45 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు.

గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు, వయసు ధ్రువీకరణ పత్రాలను కేంద్రాల వద్దకు తీసుకెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల విద్యాశాఖ అధికారులు కూడా మరో రెండు రోజుల్లో వ్యాక్సిన్‌కు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం ఉంది.

పాఠశాలల్లో 45 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు ఎంత మంది ఉన్నారనే జాబితాను ప్రధానోపాధ్యాయులు సిద్ధం చేస్తున్నారు. ఈ జాబితా వైద్యారోగ్య శాఖకు వెళ్తుంది. ఈ జాబితా ప్రకారం టీచర్లకు వ్యాక్సిన్‌ అందనుంది.