బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (11:54 IST)

వికారాబాద్‌లో రెండు తలల దూడ జననం

తెలంగాణా రాష్ట్రంలోని వికారాబాద్‌లో ఓ గేదె రెండు తలల దూడకు జన్మనిచ్చింది. ఈ దూడకు రెండు తలలతో పాటు రెండు నోళ్లు, నాలుగు కళ్లు, నాలుగు చెవులు, నాలుగు కాళ్లతో ఒకటే శరీరం ఉండటంతో ఇది వింతగా వుంది. ఈ వింత ఘటన విచిత్రంగా జన్మించిన దూడను చూసేందుకు స్థానికులు క్యూకడుతున్నారు.
 
బషీరాబాద్‌ మండలం జీవన్గి గ్రామానికి చెందిన వీరారెడ్డి అనే రైతుకు ఉన్న పశువుల్లో ఓ గేదె ఈతకు ఇబ్బంది పడుతుంటే పశువైద్యుడికి సమాచారం అందించాడు. వైద్యుడు వచ్చి గేదెను పరీక్షించి కడుపులో రెండు తలలున్న దూడ ఉందని గ్రహించి, జాగ్రత్తగా దూడను కడుపులోంచి తీశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రెండు తలలున్న దూడను చూసేందుకు తరలి వస్తున్నారు. రెండు తలలతో పుట్టిన దూడను చూసి ఆశ్చర్యపోతున్నారు. జన్యుపరమైన లోపంతోనే ఇలా జన్మిస్తుంటాయని పశువైద్యుడు తెలిపారు.