ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (17:22 IST)

'సన్నాఫ్ సత్యమూర్తి' దెబ్బ.... చైతూ 'దోచేయ్' వాయిదా..!

నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'దోచేయ్'. ఈ చిత్ర ఆడియోను తొలుత ఏప్రిల్ రెండో తేదిన విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఏప్రిల్ మూడవ వారం కానీ నాల్గవ వారంలో కానీ విడుదల చెయ్యాలని అనుకున్నారు.
 
ఇందుకు కారణంగా బన్నీ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాన్ని ఏప్రిల్ రెండో తేదిన విడుదల చేయనున్నట్టు వార్తలు రావడంతో, నాగ చైతన్య నటించిన 'దోచేయ్' సినిమాని ఏప్రిల్ 17వ తేదిన రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. 
 
అయితే అనూహ్య కారణాల వలన సన్నాఫ్ సత్యమూర్తి చిత్ర విడుదలను ఏప్రిల్ 8వ తేదికి వాయిదా వేశారు. దీంతో 'దోచేయ్' సినిమాని కూడా ఏప్రిల్ 23వ తేదికి వాయిదే వేశారు. ఈ రెండు సినిమాలను తక్కువ గ్యాప్‌తో రిలీజ్ చెయ్యలేక ఇలా లేట్ చేస్తున్నారు.