Written By
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
Last Updated : ఆదివారం, 27 సెప్టెంబరు 2015 (17:34 IST)
దమ్ముకొట్టిన ప్రియమణి : క్లాస్ పీకిన పోలీసులు
ప్రియమణికి ఎక్కడున్నా బాగా ఎంజాయ్ చేయడమే తెలుసు. తను ఎంజాయ్ చేయడమే కాకుండా పక్కనున్నవారిని కూడా ఆనందంలో ముంచి లేపుతుందంటారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఇలాంటి ఎంజాయ్‌మెంటే అమ్మడికి తిప్పలు తెచ్చిపెట్టిందట.
అమెరికాలోని న్యూజెర్సీలో వాట్స్ సంబరాల్లో పాల్గొనేందుకు ప్రియమణి, మధుశాలిని, సంగీత దర్శకుడు తమన్ వెళ్లారట. వేడుకులకోసం విచ్చేసినవారికోసం ఓ హోటల్ లో విడిదిని ఏర్పాటు చేశారట.
ఛాన్స్ దొరికిందే తడవుగా ప్రియమణి, మధుశాలిని దమ్ము పీకటం మొదలెట్టారట. వీళ్లు దమ్ములాగుతుంటే తమన్ ఊరుకుంటాడా ఏంటి..? అతడూ రింగులు రింగులుగా పొగ ఊదటం మొదలెట్టాడట. దీంతో గదిలో ఏర్పాటు చేసిన స్మోకింగ్ డిటెక్టర్లు కుయ్యిమని అరవడం ప్రారంభించాయట.
ఈ వార్నింగ్‌ను విన్న పోలీసులు రంగప్రవేశం చేసి వారిని బయటకు తీసుకెళ్లి రోడ్డుపై నిలబట్టి మరీ క్లాసు పీకారట. మన ఊర్లో చేసినట్టు ఎక్కడైనా చేస్తా ఇలాగే ఉంటుంది మరి.