శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 20 జులై 2017 (09:43 IST)

చార్మీకి డ్రగ్స్ సరఫరా చేసిన బ్యాంకాక్ బ్యాచ్?

టాలీవుడ్‌లో బ్యాంకాక్ బ్యాచ్‌గా ముద్రపడిన టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ముఠా సభ్యుల్లోని ఒకరిద్దరు సినీ నటి చార్మీకి డ్రగ్స్ సరఫరా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదేవిషయాన్ని కూడూ సిట్ అధికారులకు పూ

టాలీవుడ్‌లో బ్యాంకాక్ బ్యాచ్‌గా ముద్రపడిన టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ముఠా సభ్యుల్లోని ఒకరిద్దరు సినీ నటి చార్మీకి డ్రగ్స్ సరఫరా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదేవిషయాన్ని కూడూ సిట్ అధికారులకు పూరీ జగన్నాథ్ తెలిపినట్టు సమాచారం. చార్మీకి డ్రగ్స్ సరఫరా చేశారా? అనే ప్రశ్నకు పూరీ అవుననే సమాధానమిచ్చినట్టు వినికిడి. దీంతో ఆమె నిద్రహారాలు లేకుండా ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది. 
 
ఇదిలావుండగా, టాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న డ్ర‌గ్స్ కేసులో సినీ ప్ర‌ముఖులు హాజ‌రుకావాల్సిన తేదీలు మారిపోయాయి. గురువారం సిట్ అధికారుల ఎదుట ఛార్మీ హాజరుకావాల్సి ఉంది. కానీ, కెమెరామెన్ శ్యాం కె.నాయుడుని విచారణకు పిలిచారు.
 
అలాగే, ఛార్మీని ఏ తేదీన విచారిస్తామ‌న్న అంశాన్ని కూడా అధికారులు తాజాగా ప్రకటించారు. ఛార్మీ ఈ నెల 26న విచార‌ణ‌కు రావాల్సి ఉంటుంద‌ని అన్నారు. మొదట్లో చెప్పిన ప్రకారం, ఈ నెల‌ 26న న‌టుడు న‌వ‌దీప్‌ను విచారించాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా అధికారులు ఈ తేదీల్లో మార్పులు చేయడం గమనార్హం.