సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 మార్చి 2017 (16:12 IST)

ధనుష్, అనిరుధ్ ప్రైవేట్ రాసలీలల ఫోటోలు.. రానా త్రిష బుగ్గమీద గాఢంగా ముద్దుపెట్టి?

మలయాళ బ్యూటీ భావన లైంగిక దాడి వెలుగులోకి రాగానే.. పలువురు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో తమకు జరిగిన చేదు నిజాలను కూడా వెల్లగక్కుతున్నారు. ఈ క్రమంలో కోలీవుడ్ యంగ్ హీరోలు ధనుష్, శింబు తనపట్ల అసభ్యంగా ప్రవ

మలయాళ బ్యూటీ భావన లైంగిక దాడి వెలుగులోకి రాగానే.. పలువురు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో తమకు జరిగిన చేదు నిజాలను కూడా వెల్లగక్కుతున్నారు. ఈ క్రమంలో కోలీవుడ్ యంగ్ హీరోలు ధనుష్, శింబు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని.. ఈ విషయాన్ని ఎక్కడైనా.. ఎలాగైనా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు గాయని సుచిత్రాకార్తిక్ ప్రకటించింది. ట్వీట్ల ద్వారా ఈ విషయాన్ని చెప్పింది.

కానీ ఆమె భర్త కార్తీక్ మాత్రం ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని చెప్పారు. అయినప్పటికీ తమిళ హీరోలు శింబు, ధనుష్‌ ఓ ప్రైవేట్‌ పార్టీలో తనపై లైంగిక వేధింపులు జరిపారని, దానికి సాక్ష్యాలుగా కొన్ని ఫోటోలను పోస్ట్‌ చేసి సుచిత్ర సంచలనం సృష్టించింది. 
 
ఈ ఫోటోల్లో హీరో ధనుష్- త్రిష, యంగ్ సంగీత దర్శకుడు అనిరుధ్-నటి ఆండ్రియా.. తాప్సీ-హన్సికల రాసలీలల ఫోటోలను సుచిత్ర ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ వివాదం ప్రస్తుతం కోలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఈసారి సవివరంగా ఇది ధనుష్‌ రాసలీల, ఇది అనిరుధ్‌ రాసలీల, ఇది తాప్సిది, ఇది హన్సికది అంటూ ఒక్కో ఫోటో కింది రైటప్‌ కూడా సుచిత్ర రాసేయడంతో ఫోటోల్లో ఉండేవారంతా తలపట్టుకుని కూర్చున్నారు. అసలు సుచిత్రకు ఏమైందని అడుగుతున్నారు. 
 
అయితే ఇది కాస్తా వివాదాస్పదమవడంతో మరోసారి తన ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయిందని, ఆ ఫోటోలను తను పోస్ట్‌ చేయలేదని చెప్పి సుచిత్ర తప్పించుకునే ప్రయత్నం చేసింది. అంతేగాకుండా ఆ ఫోటోలను సైతం తన ఖాతా నుంచి డిలీట్ చేసింది. సుచిత్ర పోస్ట్ చేసిన ఫోటోల్లో ధనుష్‌, అనిరుధ్‌, హన్సిక, తాప్సీలతో పాటు తెలుగు హీరో రానా, హీరోయిన్‌ త్రిష ఫోటో కూడా బయటపెట్టింది. 
 
రానా, త్రిష లవ్‌లో ఉన్నారని అప్పట్లో వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. దీనిపై వారిద్దరూ తాము ఫ్రెండ్సేనని చెప్పుకొచ్చారు. కానీ ఈ ఫోటోలో త్రిష, రానా.  త్రిష బుగ్గపై గాఢంగా ముద్దు పెడుతున్నట్లుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం సినిమాలతో ఇద్దరూ బిజీబిజీగా ఉంటున్న వేళ ఈ ఫోటోలు లీక్ కావడం కొత్త వివాదానికి కారణమైంది.