మ‌న్మ‌ధుడు 2లో స‌ర్ఫ్రైజ్ ఏంటో తెలుసా..?

Nagarjuna
శ్రీ| Last Modified సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (20:00 IST)
అక్కినేని నాగార్జున త‌దుప‌రి చిత్రాన్ని చి.ల.సౌ ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో చేయ‌నున్నార‌నే విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పైన నాగార్జున నిర్మించ‌నున్నారు. ఈ మూవీలో ఉండే స‌ర్‌ఫ్రైజ్ అంటూ ఓ వార్త హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఇంత‌కీ ఆ వార్త ఏంటంటే... ఈ సినిమాలో నాగార్జున సతీమణి అమల ఒక కీలకపాత్ర పోషిస్తుందట‌. అది ఫుల్ లెంగ్త్ రోల్ అని సమాచారం. నాగార్జున- అమ‌ల‌ల పెళ్లి 1992లో జ‌రిగింది.

పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న‌ అమల శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం ద్వారా మళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత మనంలో ఒక అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమాలో మళ్ళీ ఆమె కెమెరా ముందుకొస్తారట. మ‌రో విషయం ఏంటంటే... ఈ సినిమాలో నాగార్జున డబల్ రోల్‌లో కనిపిస్తాడని ఆ పాత్రకు జోడీగా... యంగ్ నాగార్జునకు మదర్‌గా కనిపిస్తారని అంటున్నారు. ఇది రూమ‌ర‌ని కొంతమంది అంటుంటే.. కాదు నిజం అని కొంతమంది అంటున్నారు. మ‌రి.. క్లారిటీ రావాలంటే నాగ్ స్పందించాల్సిందే.దీనిపై మరింత చదవండి :