శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 10 మార్చి 2018 (14:57 IST)

అర్జున్ రెడ్డి సరసన అనంతపురం ప్రియాంక..?

అర్జున్ రెడ్డి సినిమా బంపర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ సరసన నటించేందుకు హీరోయిన్లు పోటీపడుతున్నారు. గీతా ఆర్ట్స్‌ అనుబంధ సంస్థ జీఏ2తో రెండు సినిమాలు చేసేందుకు విజయ్ దేవరకొండ ఒప్పందం కుదుర్చుకున్నారు.

అర్జున్ రెడ్డి సినిమా బంపర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ సరసన నటించేందుకు హీరోయిన్లు పోటీపడుతున్నారు. గీతా ఆర్ట్స్‌ అనుబంధ సంస్థ జీఏ2తో రెండు సినిమాలు చేసేందుకు విజయ్ దేవరకొండ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో ఒక సినిమా ది ఎండ్ ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. 
 
కామిక్‌ ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రంలో అర్జున్ రెడ్డికి జోడీగా అనంతలో స్థిరపడిన మరాఠీ అమ్మాయి ప్రియాంకా జవల్కర్ నటించనుంది. హైదరాబాద్‌లోని ''నిఫ్ట్'' నుంచి ఫ్యాషన్‌ కోర్సులో డిప్లొమా పొందిన ప్రియాంకా జవల్కర్.. అర్జున్ రెడ్డితో చేసే చిత్రంలో డాక్టర్‌గా కనిపించనుంది. 
 
ఇక విజయ్ దేవరకొండ ఇందులో క్యాబ్‌ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. నిజానికి ఇదివరకు హీరోయిన్‌ పాత్రకు హెబ్బా పటేల్‌, ఎవడే సుబ్రమణ్యం ఫేమ్‌ మాళవికా నాయర్‌ పేర్లు కూడా వినిపించాయి. అయితే దర్శకుడు కొత్తమ్మాయినే హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.