ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Preeti
Last Modified: సోమవారం, 16 అక్టోబరు 2017 (15:38 IST)

వామ్మో... బుల్లితెర ప్రదీప్‌కు కట్నం అంత ఆఫర్ చేశారా? కానీ ఆ యాంకర్‌తోనే...

బుల్లితెర ప్రదీప్ పెళ్లి రేసులో ఉన్నాడు. ప్రదీప్‌ సంపాదన ప్రస్తుతం భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆయనకు ఎన్నో మంచి మంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ప్రదీప్‌ షోలలో తన పెళ్లి విషయంలో అమ్మాయి దొరకడం లేదని, కొందరు అమ్మాయిలు తనను చేసుకోమంటే పారిపోతున్నారని

బుల్లితెర ప్రదీప్ పెళ్లి రేసులో ఉన్నాడు. ప్రదీప్‌ సంపాదన ప్రస్తుతం భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆయనకు ఎన్నో మంచి మంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ప్రదీప్‌ షోలలో తన పెళ్లి విషయంలో అమ్మాయి దొరకడం లేదని, కొందరు అమ్మాయిలు తనను చేసుకోమంటే పారిపోతున్నారని సెటైర్లు వేస్తూ కామెడీ పండిస్తుంటాడు. కానీ అసలు నిజమేమిటంటే ప్రదీప్‌కు అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం అనేక షోలు చేస్తూ భారీగానే సంపాదిస్తున్నాడు. 
 
ఇక అప్పుడప్పుడూ సినిమాల్లో కూడా దర్శనమిస్తున్నాడు. ప్రదీప్ కుటుంబ సభ్యులు అతడికి వివాహం చేయడానికి మంచి అమ్మాయి కోసం అన్వేషణ మొదలుపెట్టారని సమాచారం. ఇటీవల వైజాగ్‌‌కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త ప్రస్తుతం అమెరికాలో ఎమ్మెస్‌ చేస్తున్న తన కూతురును ప్రదీప్‌ పెళ్లి చేసుకుంటే 5 కోట్ల కట్నంతో పాటు విశాఖపట్నంలో ఖరీదైన ఏరియాలో ఉన్న రెండు ఫ్లాట్లను ఇస్తానన్నారట. తన కూతురుకు ప్రదీప్‌ అంటే ఇష్టం అని, ఎలాగైనా పెళ్లి కుదర్చడానికి ప్రదీప్‌ తల్లిదండ్రులతో మాట్లాడారంట. కాని ప్రదీప్‌ మాత్రం ఈ సంబంధంపై మొగ్గు చూపలేదు. 
 
ఒకవేళ అమ్మాయి ప్రదీప్‌కు నచ్చకపోవడం వలన కట్నం కంటే అమ్మాయికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తిరస్కరించి ఉంటాడని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ప్రదీప్‌ ప్రేమలో ఉన్నాడని, అందుకే తల్లిదండ్రులు చూస్తున్న సంబంధాలను తిరస్కరిస్తున్నాడని అంటున్నారు. ఈ వాదనకు బలం చేకూరుస్తూ ప్రదీప్‌ను ప్రేమ విషయం గురించి అడిగగా నవ్వి ఊరుకున్నాడు. ప్రదీప్‌కు అత్యంత సన్నిహితమైన మరో యాంకర్ ప్రదీప్‌కు పెళ్లిపై చాలా స్పష్టత ఉంది, కనుక మంచి నిర్ణయం తీసుకుంటాడని అన్నాడు. ఐతే ప్రదీప్ మాత్రం మరో లేడీ యాంకర్ తో పీకల్లోతు ప్రేమాయణంలో వున్నాడని చెప్పుకుంటున్నారు. ఆమెనే పెండ్లాడతాడని అంటున్నారు. మరి పెళ్లికాని ఆ యాంకర్ ఎవరబ్బా?