శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2017 (17:50 IST)

షూటింగ్ స్పాట్‌లోనూ ''జై''ని వదలని అంజలి.. కేకుతో వెళ్లి.. రోజంతా..?!

జై పుట్టిన రోజు సందర్భంగా అంజలి అతనికి సర్ ఫ్రైజ్ ఇచ్చిందట 'బెలూన్' సినిమా షూటింగ్‌లో ఉన్న జై వద్దకు అంజలితో కేకుతో వెళ్లి.. యూనిట్ మధ్య జైతో కేక్ కట్ చేయించి.. అతనికి తినిపించిందట. ఆ రోజంతా వారిద్దరూ

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రస్తుతం జర్నీ హీరో జైతో ప్రేమాయణం సాగిస్తోంది. ఎంచక్కా సినిమాలు, పార్కులు, బీచ్‌లంటూ షికార్లే కాకుండా.. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని.. షూటింగ్ స్పాట్‌లకు కూడా ఇద్దరూ జోడీగా వెళ్తున్నారని కోలీవుడ్‌లో ఒకటే టాక్.

కోలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు పాకిన అంజలి.. జైతో కలిసి.. తమిళ స్టార్ సూర్య పిలుపుతో 'దోశ ఛాలెంజ్'ను స్వీకరించి, దోశ వేసి అంజలితో తినిపించిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ నిజమేనని నిరూపించారు. 
 
తాజాగా ఏం జరిగిందంటే? జై పుట్టిన రోజు సందర్భంగా అంజలి అతనికి సర్ ఫ్రైజ్ ఇచ్చిందట 'బెలూన్' సినిమా షూటింగ్‌లో ఉన్న జై వద్దకు అంజలితో కేకుతో వెళ్లి.. యూనిట్ మధ్య జైతో కేక్ కట్ చేయించి.. అతనికి తినిపించిందట. ఆ రోజంతా వారిద్దరూ కలిసే ఉన్నారట.

వారిద్దరిని చూస్తే అ భార్యాభర్తల్లాగే ఉన్నారని 'బెలూన్' సినిమా యూనిట్ చెవులు కొరుక్కున్నారట. వీరి వివాహానికి ఇప్పటికే పెద్దల అంగీకారం లభించిందని టాక్. త్వరలోనే వీరి ప్రేమ పెళ్లిగా మారనుందని సమాచారం.