''చిత్రాంగద''గా మళ్లీ భయపెట్టనున్న అంజలి.. అమ్మడు పాటే హైలైట్!

అంజలి ప్రధాన పాత్రలో పిల్లజమీందార్ ఫేమ్ అశోక్ తెరకెక్కిస్తున్న చిత్రం చిత్రాంగద. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని

శనివారం, 18 జూన్ 2016 (08:39 IST)
అంజలి ప్రధాన పాత్రలో పిల్లజమీందార్ ఫేమ్ అశోక్ తెరకెక్కిస్తున్న చిత్రం చిత్రాంగద. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కొన్నిఅనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. 
 
అయితే ప్రస్తుతం అన్ని పనులు పూర్తి చేసుకుని జులై తొలి వారంలో విడుదలకు సిద్ధమౌతున్నట్లు యూనిట్ సభ్యులు వెల్లడించారు. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతోనే ఈ చిత్రం కొద్ది రోజుల్లో సెన్సార్ కూడా జరుపుకోనుందని సినీపండితులు అంటున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో కథానాయిక అంజలి ఓ పాట పాడటం విశేషం. డ...డ..డాంగ్...డాంగ్.. డంగ్ చుక్.. డంగ్ చుక్... యాపిల్ ఫోన్.. యాపిల్ రేటుకు వస్తే.. ఆషాడం సేల్‌లో ఆడీ కారు గిఫ్ట్‌గా వస్తే అంటూ అంజలి ఆలపించిన పాట ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని దర్శకనిర్మాతలు అంటున్నారు. 
 
గతంలో అంజలి నటించిన ''గీతాంజలి'' హారర్‌ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. దీని తరువాత మళ్లీ అంజలి నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మళ్లీ దెయ్యం గెటప్‌లో మళ్లీ అందరిని భయపెట్టడానికి రానుందన మాట.

అన్నీ చూడండి

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments