సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (17:18 IST)

అనుపమ అందంగానే ఉంది.. కానీ, నటన ఇంప్రెస్ చేసేలా లేదంటున్న హీరోలు

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్. ఈమె మాతృభాషలో కంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటోంది. తెలుగులో వరుసగా మూడు విజయాలతో మంచి ఫామ్‌లో ఉది. ఆ ఊపులోనే రామ్‌చరణ్‌ - సుకుమార్‌ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్. ఈమె మాతృభాషలో కంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటోంది. తెలుగులో వరుసగా మూడు విజయాలతో మంచి ఫామ్‌లో ఉది. ఆ ఊపులోనే రామ్‌చరణ్‌ - సుకుమార్‌ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా కూడా దక్కించుకుంది. 
 
అయితే, ఈ అవకాశం వచ్చినట్టే వచ్చిన చేజారి పోయింది. దీనికి అనుపమ హఠాత్తుగా పెంచేసిన పారితోషికమే కారణమని తొలుత గుసగుసలు వినిపించాయి. కానీ, ఆ చిత్రం నుంచి అనుపమను తొలగించడానికి కారణం పారితోషికం కాదన్నది ఫిల్మ్ నగర్ వర్గాల తాజా సమాచారం. 
 
శర్వానంద్ - అనుపమల కాంబినేషన్‌లో సంక్రాంతికి వచ్చిన చిత్రం శతమానంభవతి. ఈ చిత్రాన్ని మెగా ఫ్యామిలీ హీరోలు చిరంజీవితో పాటు.. అందరూ వీక్షించారు. ఇందులో అనుపమ నటనకు వారు ఇంప్రెస్ కాలేక పోయారట. పైగా, చరణ్‌ పక్కన అనుపమ బాగుండదని, చరణ్‌ పక్కన చిన్న పిల్లలా కనబడుతుందని అందరూ అన్నారట. అదే విషయాన్ని నిర్మాతలకు హీరో చరణ్ చెప్పడంతో అనుపమను సినిమా నుంచి తప్పించినట్టు సమాచారం.