ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (13:49 IST)

మల్లూ బేబీ వెనుక పడుతున్న టాలీవుడ్ హీరోలు... అంతగా మాయ చేస్తుందా?

తెలుగు యువ హీరోలు ఎవరైనా కుర్ర హీరోయిన్ బాగుందంటే చాలు.. ఆమెను బుక్ చేసుకునేందుకు అమిత ఉత్సాహం చూపిస్తున్నారు. అలాంటి హీరోయిన్లల్ అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు ఈ మల్లూ బేబి వెనుక పడుతున్నారట. ఫలితంగా ఆమెకు వరుస మూవీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. తాజాగా తెలుగు హీరలు నాని, నిఖిల్ చిత్రాల్లో ఈ బేబీ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. 
 
తెలుగు యువ హీరోల్లో ఒకరైన నిఖిల్ సరసన ఈమె రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వచ్చాయి. వీటిలో ఒకటి 'కార్తికేయ' సీక్వెల్ కాగా, మరొకటి '18 పేజెస్' చిత్రం. ఇప్పుడీ భామకు తాజాగా మరో మంచి అవకాశం కూడా వచ్చినట్టు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని సరసన కథానాయికగా నటించే ఛాన్స్‌ను ఈ ముద్దుగుమ్మ పొందినట్టు చెబుతున్నారు.
 
'కార్తికేయ' సినిమా సూపర్ హిట్ అయిన కారణంగా సీక్వెల్‌గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా మరో థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు చందు మొండేటి రూపొందించేందుకు స్ర్కిప్ట్ వర్క్ చేశాడు. 
 
ఇక ఈ సినిమాతో పాటు నిఖిల్ 'కుమారి 21ఎఫ్' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో '18 పేజెస్' అనే సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. వీటితో పాటు నిఖిల్ తన కెరీర్లో 20వ ఈ చిత్రాన్ని నారాయణదాస్ కె నారంగ్ మరియు పుష్కర్ రామ్ ఎమ్ రావ్ నిర్మాణంలో చేయనున్నారు. తాజా వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఈ  రెండు సినిమాల్లో మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. 
 
ప్రస్తుతం 'టక్ జగదీశ్' సినిమాలో నటిస్తున్న నాని ఆ తర్వాత 'శ్యామ్ సింగరాయ్' పేరిట రూపొందే చిత్రంలో నటిస్తాడు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. ఇందులో మొదటగా సాయిపల్లవిని హీరోయిన్‌గా తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, లాక్డౌన్ కారణంగా డేట్స్ అన్నీ అప్సెట్ కావడంతో ఆమె ఈ చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేయలేకపోతోందట. దాంతో ఆమె స్థానంలో అనుపమను తీసుకున్నట్టు సమాచారం.
 
కాగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి. వచ్చే నెల నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుండగా, 'అఆ' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్ వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.