టీడీపీకి షాక్ : గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారి రాజీనామా

galla aruna kumari
ఠాగూర్| Last Updated: గురువారం, 1 అక్టోబరు 2020 (17:10 IST)
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమె గుంటూరు జిల్లా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తల్లి. తన రాజీనామా లేఖను పార్టీ అధినాయకత్వానికి ఆమె గురువారం పంపించారు.

గతకొన్నిరోజులుగా టీడీపీ అధినాయకత్వం కొత్త కమిటీల నియామకం జరుపుతోంది. ఇటీవలే పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్చార్జిలను కూడా నియమించింది. ఈ తరుణంలో అరుణకుమారి కీలక బాధ్యతల నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాతృమూర్తి అయిన గల్లా అరుణకుమారి 2014లో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. రాష్ట్రవిభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల ముందు నుంచి ఆమె పార్టీ కార్యకలాపాలకు కాస్త ఎడంగానే ఉంటున్నారు.దీనిపై మరింత చదవండి :