శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (16:40 IST)

మూడు రాజధానులకు మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగి రాజీనామా

మూడు రాజధానులకు మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగి బసవరావ్ రాజీనామా చేశారు. మంగళగిరి మండలం కురగల్లుకు చెందిన బసవరావ్.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని హుమయున్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
 
అమరావతి పేరుతో ఆనాటి సీఎం చంద్రబాబు భూములను బలవంతంగా లాక్కున్నారని బసవరావ్ ఆరోపించారు. సీఎం జగన్ నిర్ణయానికి తాను మద్దతు తెలుపుతున్నానని అందుకే ఏపీలో అభివృద్ధి పాలన వికేంద్రీకరణ మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
 
ఇంకా పదేళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగాన్ని వదులుకుంటున్నానని హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు.