Daily Horoscope
✕

అనుష్క ఆ మాట చెప్పగానే గుండె పగిలినట్లయ్యింది, మెహరీన్

Written By జె
Updated: శుక్రవారం, 15 నవంబరు 2019 (14:58 IST)
తెలుగు  సినీపరిశ్రమలో యువ హీరోయిన్లలో మెహరీన్ కు ప్రత్యేక స్థానం ఉంది. క్యూట్ లుక్స్‌తో మెహరీన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మహానుభావుడు సినిమాలోను, ఎఫ్‌..2 లాంటి సినిమాల్లో హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ చెప్పిన డైలాగ్‌లు తెలుగు ప్రేక్షకులను ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్నాయి. 
 
అయితే మెహరీన్ తన నడవడిక.. తన వ్యక్తిత్వం గురించి తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. నేను బాగా అభిమానించే హీరోయిన్లలో మొదటి వ్యక్తి అనుష్క. నేను సినిమాలోకి రాకముందు నుంచి ఆమె సినిమాలను క్రమం తప్పకుండా చూసేదాన్ని. అనుష్కతో కలిసి నేను మహానుభావుడు సినిమా చూశా. బాగా చేశావు అంటూ ఆమె నన్ను పొగిడారు. అప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుని పగిలినట్లనిపించింది. అంటే అంత సంతోషమన్నమాట. 
 
ఎంతో గొప్ప హీరోయిన్‌గా, సహజ నటిగా మంచి పేరు సంపాదించుకున్న అనుష్క తన సినిమా బాగుందని చెప్పడం చాలా సంతోషాన్నిచ్చిదంటోంది మెహరీన్. ఎఫ్..2 సినిమా చూసి ఆ సినిమాలో కూడా బాగా చేశావని 100 మార్కులు అనుష్క తనకు వేసిందని.. తన ప్రతి సినిమాను అనుష్క చూడడం.. తనను మెచ్చుకోవడం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనంటోంది మెహరీన్. 

అన్నీ చూడండి

స్పెయిన్: రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 64 మంది మృతి

మత్తు మందు ఇచ్చి అత్యాచారం, ఆ వీడియోలు చూపించి 10 తులాల బంగారం లాగేశారు

Cyclone Arnab: అర్నబ్ తుఫాను.. ఉత్తరాంధ్రలో 26సెం.మీ వర్షపాతం.. ఏడుగురు మృతి..?

తెలంగాణలో అర్నబ్ సైక్లోన్.. రాబోయే 24 గంటల్లో వర్షాలు ఎక్కడెక్కడంటే?

Cyclone Arnab: ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్.. అప్రమత్తం చేసిన పోలీసులు

అన్నీ చూడండి

గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు

హెచ్‌సీజీ విశాఖ, ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన

మీకు పదేపదే దద్దుర్లు వస్తున్నాయా, వాటిని అలర్జీ అనుకుంటున్నారా, కాకపోవచ్చు...

ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'

కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments