గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (12:33 IST)

ప్రభాస్ నిక్ నేమ్‌ను బయటపెట్టిన అనుష్క

prabhas anushka
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, ఎవర్ గ్రీన్ నటి అనుష్క శెట్టి బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 వంటి కొన్ని హిట్ సినిమాల్లో కలిసి నటించారు. ఇటీవల విడుదలైన అనుష్క కొత్త చిత్రం ‘మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. 
 
ఈ టీజర్‌పై భలే అంటూ అనుష్కను అభినందించారు. దీనికోసం అనుష్క ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ.. అతని నిక్ నేమ్‌ను వెల్లడించింది. "పుప్సూయు" అంటూ సంబోధించింది. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కాగా.. ఇటీవల కృతిసనన్, ప్రభాస్ ప్రేమలో వున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారి లవ్ స్టోరీ ఇంటర్నెట్‌లో పాపులర్ టాపిక్‌గా మారింది.