శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 8 మే 2017 (03:43 IST)

ఆ బీభత్స ప్రచారమే బాహుబలి-2 ప్రభంజనానికి కారణమా?

సినిమా కథ, పాత్రల చిత్రీకరణే ఏ సినిమా విజయానికైనా మూల కారణం అనే రాజమౌళి అభిప్రాయాలకు విలువ ఇస్తూనే ఆదాయానికి వీలున్న ఏ విభాగాన్ని వదలిపెట్టని నిర్మాతల ప్రచార వైవిధ్యం కూడా బాహుబలి-2 అఖండ విజయానికి బాటలు వేసిందని చెప్పక తప్పదు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ప్రచ

ఈ మాట అంటే రాజమౌళికి అమాంతంగా కోపం ముంచుకు రావచ్చు. అయిదేళ్లు అష్టకష్టాలు పడి బాహుబలి చిత్రం కోసం జీవితాన్ని ధారపోస్తే..అదేం కాదు.. ప్రచారమే ఇంతటి విజయానికి కారణమంటారా అంటూ రాజమౌళి ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు. సినిమా కథ, పాత్రల చిత్రీకరణే ఏ సినిమా విజయానికైనా మూల కారణం అనే రాజమౌళి అభిప్రాయాలకు విలువ ఇస్తూనే ఆదాయానికి వీలున్న ఏ విభాగాన్ని వదలిపెట్టని నిర్మాతల ప్రచార వైవిధ్యం కూడా బాహుబలి-2 అఖండ విజయానికి బాటలు వేసిందని చెప్పక తప్పదు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ప్రచారం ప్రతి మలుపులోనూ రాజమౌళి హస్తం ఉండటమే..

 
భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోస్టర్ల విడుదలలో బాహుబలి నిర్మాతలు, దర్శకుడు సరికొత్త పంథా అవలంబించడం ఆ చిత్ర విజయానికి అద్భుత ప్రోత్సాహాన్నిచ్చిందని చిత్ర రంగ నిపుణులు పేర్కొంటున్నారు. సినిమా ప్రచారంలో బాహుబలి కొత్త అధ్యాయానికి తెరతీసింది. ఆదాయానికి వీలున్న ఏ విభాగాన్నీ నిర్మాతలు వదిలిపెట్టలేదు. వర్చువల్‌ రియాలిటీ, టీవీ, యానిమేటెడ్‌ సిరీస్, బాహుబలి ఉత్పత్తులు, నవలలు, కామిక్‌ పుస్తకాలు ఇలా ప్రతి రంగంలోకి బాహుబలి ప్రవేశించింది. మొదటి భాగం ప్రారంభమైన నాటి నుంచి నటీనటుల పుట్టినరోజులకు టీజర్లు, మేకింగ్‌ వీడియోలు, పరీక్షలకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోలు, కామెడీ స్కిట్‌లు ఇలా కనీసం నెలకొక్క విషయమైనా వార్తల్లో ఉంటూ ప్రజల్లో ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. 
 
మొదటి భాగం విడుదల సమయంలో పాత్రల పరిచయం అంటూ మూడు రోజులకో పోస్టర్‌ వదలడం కూడా భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి. ఇక రెండో భాగం విషయానికి వస్తే సినిమా కంటే ఇతర అంశాలే ఎక్కువగా వార్తల్లో నిలిచాయి. ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రభాస్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘ద రైజ్‌ ఆఫ్‌ శివగామి’పుస్తకం అమెజాన్‌ బెస్ట్‌ సెల్లర్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఓ సినిమాకు ఎలా ప్రచారం చేయాలో రాజమౌళిని చూసే నేర్చుకోవాలంటూ ఎంతో మంది కితాబిచ్చారు.
 
ఈ సినిమాకు లభిస్తున్న ప్రశంసలన్నీ ఓ ఎత్తయితే, దీనిపై ప్రతిష్టాత్మక బీబీసీ చానెల్‌లో కథనం రావడం మరో ఎత్తు. భారతీయ సినిమా రికార్డులన్నీ ఈ చిత్రం బద్దలుగొట్టిందని, అమెరికాలో ఈ వారం విడుదలైన అన్ని చిత్రాల్లో(హాలీవుడ్‌ సహా) బాహుబలి వసూళ్ల పరంగా మూడో స్థానంలో నిలిచిందని ఈ కథనంలో తెలిపారు. ఇందుకోసం వారు రాజమౌళి, అనుష్కను ఇంటర్వూ్య చేశారు.