suvichar
✕

హిట్ కోసం సెంటిమెంట్‌ని న‌మ్ముకున్న బాల‌య్య‌

Written By శ్రీ
Updated: మంగళవారం, 7 మే 2019 (12:07 IST)
నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన‌ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హా నాయ‌కుడు చిత్రాలు ఫ్లాప్ అవ్వ‌డంతో బాగా అప్‌సెట్ అయ్యాడ‌ట‌. ఈసారి ఎలాగైనా స‌రే స‌క్స‌ెస్ సాధించాల‌ని ప‌క్కా ప్లాన్ రెడీ చేసాడ‌ట‌. మ్యాట‌ర్ ఏంటంటే... ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్‌తో బాల‌కృష్ణ మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘జైసింహా’ సినిమాతో తొలిసారి జతకట్టిన వీరిద్దరూ మరోసారి హిట్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తున్నారు.
 
ప్రముఖ నిర్మాత, సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు విలన్ పాత్రను పోషించనున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఈ వార్తలను నిజం చేస్తూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బాలయ్యకు విలన్‌గా జగపతిబాబు నటిస్తున్నట్లు పేర్కొంది. బ్లాక్‌ బ‌స్టర్ ‘లెజెండ్‌’ త‌ర్వాత బాల‌కృష్ణ, జ‌గ‌ప‌తిబాబు మరోసారి తలపడుతున్నారు. జ‌గ‌ప‌తిని విల‌న్‌గా ఎంచుకోవ‌డానికి కార‌ణం లెజెండ్ స‌క్స‌స్ అవ్వ‌డ‌మే అంటున్నారు.
 
 ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. సంక్రాంతికి బాల‌య్య‌ వ‌స్తే.. హిట్టే. ఈ భారీ చిత్రం మే 17న లాంఛనంగా ప్రారంభం అవుతుంది. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సినిమాకు సంబంధించిన మిగ‌తా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను త్వర‌లో ప్రక‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. హిట్ కోసం సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారు. మ‌రి.. సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయి బాల‌య్య‌కి విజ‌యాన్ని అందిస్తుందో లేదో..?

అన్నీ చూడండి

తుఫాను రాకకు ముందే.. 17 జిల్లాలకు రూ.37 కోట్లు కేటాయించిన ఏపీ

Cyclone Murasu: చంద్రబాబుకు ఫోన్ చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ఏపీలో ఉత్కంఠ వాతావరణం - నేడు మున్సిపల్ ఓట్ల లెక్కింపు

Cyclone Murasu: నవంబర్ 5 వరకు భారీ వర్షాలు.. 110 కిలోమీటర్ల వేగంతో గాలులు

మరుదుల ఘాతుకం - ఆస్తి కోసం అన్న భార్యను చంపేశారు

అన్నీ చూడండి

లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు

మలబద్ధకం నుంచి ఉపశమనం: కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్‌

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?

విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం

కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్‌కు చికిత్స

తర్వాతి కథనం
Show comments