మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (16:59 IST)

హీనాఖాన్‌ సిగ్గుపడాలి.. దక్షిణాది హీరోయిన్లపై పనికిరాని మాటలా?: హన్సిక

దక్షిణాది హీరోయిన్లపై విమర్శలు చేసిన బుల్లితెర నటి హీనాఖాన్‌పై హీరోయిన్ హన్సిక మండిపడింది. ప్రస్తుతం ప్రసారం అవుతున్న హిందీ ''బిగ్ బాస్''సీజన్-11లో బాలీవుడ్ బుల్లితెర నటి హీనాఖాన్ కాంటెస్టెంట్‌గా ఉంది

దక్షిణాది హీరోయిన్లపై విమర్శలు చేసిన బుల్లితెర నటి హీనాఖాన్‌పై హీరోయిన్ హన్సిక మండిపడింది. ప్రస్తుతం ప్రసారం అవుతున్న హిందీ ''బిగ్ బాస్''సీజన్-11లో బాలీవుడ్ బుల్లితెర నటి హీనాఖాన్ కాంటెస్టెంట్‌గా ఉంది. ఓ సందర్భంలో దక్షిణాది నటీమణుల గురించి ఈ షోలో దిగజారుడు వ్యాఖ్యలు చేసింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దక్షిణాది భామలు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 
 
అయితే, ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా దక్షిణాది ముద్దుగుమ్మ హన్సిక హీనాఖాన్‌పై విమర్శలు గుప్పించింది. దక్షిణాది ఇండస్ట్రీలో హీరోయిన్ అని చెప్పుకునేందుకు తాను గర్వంగా ఫీలవుతానని తెలిపింది. బాలీవుడ్ నటులు చాలామంది సౌత్ ఇండస్ట్రీలో పని చేశారు.. చేస్తూనే ఉన్నారు. మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటానికి హీనాఖాన్ సిగ్గుపడాలి. 
 
సౌత్ ఇండియన్ హీరోయిన్స్‌ని ఆమె ఎలా డీగ్రేడ్ చేస్తూ మాట్లాడగలదు? అంటూ హీనాఖాన్‌పై ఫైర్ అయ్యింది. ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన హీనా ఖాన్ సిగ్గు పడాలని, ఆమె చెప్పిన మాటలన్నీ పనికిమాలిన మాటలేనని పేర్కొంది.