మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2017 (12:57 IST)

మలయాళం సినిమాలో విశాల్-హన్సిక-శ్రీకాంత్-రాశీఖన్నా: మోహన్ లాల్‌కు విలన్‌గా?

మలయాళం సినిమాలో గాయనిగా హన్సిక కనిపించబోతుందట. తెలుగు, తమిళ సినిమాల్లో తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హన్సిక.. మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మలయాళంలో విల్లన్ అని తెరకెక్కే సినిమాలో అమ్మడ

మలయాళం సినిమాలో గాయనిగా హన్సిక కనిపించబోతుందట. తెలుగు, తమిళ సినిమాల్లో తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హన్సిక.. మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మలయాళంలో విల్లన్ అని తెరకెక్కే సినిమాలో అమ్మడు గాయనిగా నటించనుంది. ఇదే చిత్రంలో నిర్మాతల సంఘం అధ్యక్షుడు విశాల్ కూడా ఇందులో నెగటివ్ షేడ్స్‌లో కనిపిస్తాడట. 
 
ఉన్నికృష్ణన్ రూపొందించే ఈ చిత్రంలో మోహన్ లాల్, విశాల్, మంజు వారియర్, రాశీ ఖన్నా, హన్సిక మొత్వానీ, శ్రీకాంత్ తదితరులు నటించారు. లింగ సినిమాను నిర్మించిన రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
ఇక విశాల్, హన్సికలకు ఇదే తొలి మలయాళ సినిమా. ఇందులో విశాల్ శక్తివేల్ పళనిసామిగా మోహన్ లాల్‌కు విలన్‌గా నటిస్తున్నాడు. హన్సిక కూడా నెగటివ్ రోల్‌లో శ్రేయ అనే పేరుతో ఈ చిత్రం కనిపిస్తుందని టాక్ వస్తోంది. తెలుగు హీరో శ్రీకాంత్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు.