Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మీ సంచలన నిర్ణయం, వెండితెరపై వద్దనుకుంటున్నారా?

Written By శ్రీ
Updated: శనివారం, 4 జులై 2020 (13:37 IST)
తెలుగు సినిమాల్లో కమెడియన్ అనగానే ప్రజెంట్ జనరేషన్‌కి ఠక్కున గుర్తుకువచ్చేంది హాస్య బ్రహ్మ మన బ్రహ్మానందం. నాటి నుంచి నేటి వరకు ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను నవ్వించాడు. ఎంతలా బ్రహ్మి పాపులర్ అయ్యారంటే... బ్రహ్మానందం ఉంటే సినిమా హిట్టు లేడంటే ఫట్టు అనేంతగా.
 
ఒకానొక దశలో సినిమాలో బ్రహ్మానందంకు తగ్గ పాత్ర లేకపోయినా... ఆయన ఉండాల్సిందే అని ఆయన కోసం పాత్రను సృష్టించేవారు. కొన్ని వందల చిత్రాల్లో నటించి సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు.
 
 అలాంటి బ్రహ్మానందంకు ప్రస్తుతం సినిమాలు లేవు. అవును.. ఇది నిజంగా నిజం. దీంతో బ్రహ్మానందం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. 
 
ఇంతకీ ఏంటా నిర్ణయం అంటే... ఇక సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నారట. అయితే... టీవీ సీరియళ్ల వైపు దృష్టి సారించినట్టు తెలిసింది. అంతేకాకుండా... బుల్లితెరపై కామెడీ షోలు చేయడానికి కూడా ఓకే చెప్పినట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఇది చర్చనీయాంశం అయ్యింది.
 
బిగ్ స్ర్కీన్ పైన కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మి.. బుల్లితెర పైన నవ్వులు పూయిస్తారా...? అనేది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా... బ్రహ్మి ట్రెండ్‌కి తగ్గట్టుగా మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి... బుల్లితెరపై బ్రహ్మి ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి.

అన్నీ చూడండి

కేసీఆర్ బాటలో కవిత.. పేదలందరికీ ఒక్కో ఎకరం భూమి.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Pawan Kalyan: కేరళకు వెళ్లనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... ఎందుకని?

నా కుమార్తె చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం... నాకు సంబంధం లేదు : కొండా సురేఖ

టీచర్‌కు భయపడి గుండెపోటుతో ప్రాణాలు విడిచిన విద్యార్థి (వీడియో)

భార్యను, సోదరిని చంపేశాను.. ఆత్మహత్యకు ముందు వ్యక్తి వాట్సాప్ స్టేటస్

అన్నీ చూడండి

చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం

దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు

తలలోని అతిపెద్ద కేన్సర్ కణితిని తొలగించిన ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ వైద్యులు

ఎముక పుష్టి ఏమేమి తినాలి?

ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?

తర్వాతి కథనం
Show comments