సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (17:14 IST)

అందాల ఆరబోతకు సై అంటూ 'కలర్స్' తార రీ ఎంట్రీ

ఇటీవలి కాలంలో చాలా మంది కుర్ర హీరోయిన్లు కెరీర్‌లో నిలదొక్కుకోకముందే ప్రేమలోపడిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాంటి వారిలో కలర్స్ స్వాతి ఒకరు. ఈమె ప్రేమలో పడింది. ఆ తర్వాత వికాస్ వాసు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమె పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. 
 
క‌ల‌ర్స్ ప్రోగ్రామ్‌లో త‌న చ‌లాకీత‌నంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ కార్యక్రమం కారణంగానే ఆమెకు కలర్స్ స్వాతి అని పేరువచ్చింది. తెలుగులో చివ‌ర‌గా "లండ‌న్ బాబులు" చిత్రంలో క‌నిపించిన స్వాతి.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఏ సినిమా చేయలేదు. 
 
తాజాగా ఈ భామ సుదీర్ఘ విరామం త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంద‌నే వార్త ఇపుడు ఫిలింన‌గ‌రులో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఓటీటీ ప్లాట్ ఫాం కోసం వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. గ‌తంలో ఎన్న‌డూ క‌నిపించ‌ని విధంగా స‌రికొత్త రోల్‌లో స్వాతి క‌నిపించ‌నుంద‌ని ఇన్‌సైడ్ టాక్‌.
 
అయితే స్వాతి నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. కొత్త ద‌నంతో కూడిన క‌థ‌ల్లో న‌టించేందుకు ఆస‌క్తి చూపించే స్వాతి మ‌రి సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి మూవీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుందో చూడాలి.