శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (16:02 IST)

షాకింగ్ న్యూస్.. భార్య ఎస్తర్‌కు విడాకులు ఇచ్చేస్తున్నా.. టాలీవుడ్‌ నటుడు నోయల్‌

Singer noel
ప్రముఖ ర్యాపర్‌, టాలీవుడ్‌ నటుడు నోయల్‌ మంగళవారం అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పాడు. భార్య ఎస్తర్‌ నుంచి తాను విడాకులు తీసుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేశామని, ఇన్నాళ్లు కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూసినట్లు తెలిపాడు. అభిప్రాయ భేదాల కారణంగా తాము విడిపోతున్నామని, తమ మధ్య ఉన్న అందమైన బంధాన్ని, దాని విలువను కాపాడుకునేందుకు ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. 
 
ఎస్తర్‌ భవిష్యత్‌ బాగుండాలని, తనకు అంతా మంచే జరగాలని, తను కన్న కలలు నిజం కావాలని ఆకాంక్షించాడు. విడాకుల విషయంలో తన కుటుంబాన్ని గానీ, ఎస్తర్‌ను గానీ ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశాడు. అలాగే కష్ట సమయాల్లో తనకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నోయల్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. సరికొత్త ఆశలతో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నోట్‌ను షేర్‌ చేశాడు.