గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (19:40 IST)

అద్గదీ విషయం, విద్యుల్లేఖ అందుకే సన్నబడింది, నిశ్చితార్థం ఫోటోలు షేర్ (video)

బొద్దుగా వుండే హాస్య నటి విద్యుల్లేఖ ఒక్కసారిగా మెరుపుతీగలా సన్నబడటంతో అంతా అవాక్కయ్యారు. కానీ వర్కవుట్ల వెనుక అసలు కారణం ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుండటమే. ఆగస్టు 26వ తేదీ నాడు ఆమె ఫిట్నెస్ నిపుణులు, న్యూట్రిషియన్ సంజయ్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను విద్యుల్లేఖ తన ఇన్‌స్టాగ్రాం ద్వారా షేర్ చేశారు. త్వరలో తమ పెళ్లి జరుగుతుందని ఆమె వెల్లడించారు. 
 
నిశ్చితార్థం ఫోటోలను చూసిన పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు విషెస్ చెప్పారు. హే క్యూటీస్ అంటూ రాశీ ఖన్నా విష్ చేయగా కంగ్రాట్స్ అక్కా అంటూ వరుణ్ తేజ్ విష్ చేశారు. ఇంకా నిధి అగర్వాల్, పాయల్ రాజ్, రుహాని శర్మ తదితరులు ఆమెకి విషెస్ చెప్పారు.