శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (16:45 IST)

మరో యుద్ధానికి సిద్ధమయ్యావు.. అంతిమ విజయం నీదే : సంజయ్ ప్రాణ స్నేహితుడు

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ మరో పోరాటానికి సిద్ధమయ్యాడు. ఆయనకు ఇటీవల జరిపిన వైద్య పరీక్షల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ నాలుగో దశలో ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. 
 
అలాగే, సంజూ భాయ్ ప్రాణ స్నేహితుల్లో ఒకరైన పరేష్ ఘెలాని కూడా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసారు. సంజయ్ దత్ జీవితంలో ఎన్నో పోరాటాలు చేశాడని, ఇప్పుడు మరో యుద్ధానికి సిద్ధమయ్యాడని, దీనిలో కూడా ఖచ్చితంగా విజేతగానే నిలుస్తాడని ఆకాంక్షించాడు.
 
'సంజయ్.. జీవితంలో తర్వాతి దశను ఆస్వాదించడం గురించి ఇటీవలె మనం మాట్లాడుకున్నాం. నడవగలుగుతున్నందుకు, జాగింగ్ చేయగలుగుతున్నందుకు, ప్రయాణించగలుగుతున్నందుకు ఎంతో అదృష్టవంతులమని అనుకున్నాం. భవిష్యత్తు కూడా ఇంతే ఆనందంగా, కలర్‌ఫుల్‌గా ఉంటుందని నమ్ముతున్నా. 
 
మనం ఇప్పటికే అమ్యూజ్‌మెంట్ పార్క్ అంతా తిరిగేశామని అనుకున్నాం. అయితే మనం ఇంకా చూడాల్సింది ఉంది. మరో రోలర్ కోస్టర్ రైడ్‌కు సిద్ధమవ్వాలి. మరో యుద్ధాన్ని మొదలు పెట్టాలి. నీ మనోస్థైర్యం గురించి తెలుసు. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావ'ని పరేష్ తన పోస్టులో పేర్కొన్నాడు.