శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 ఆగస్టు 2020 (16:16 IST)

మీ అందరి ఆశీస్సులతో నేను క్షేమంగా ఉన్నా : సంజయ్ దత్

కోట్లాది మంది అభిమానులు, ప్రజల ఆశీస్సులు, దీవెనలతో తాను క్షేమంగా ఉన్నట్టు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వెల్లడించారు. అయితే, ప్రస్తుతం తాను వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలో ఉన్నట్టు తెలిపారు.
 
కాగా, శ్వాస పీల్చడం ఇబ్బందిగా ఉండటంతో సంజయ్ దత్‌ను శనివారం రాత్రి ముంబైలోని లీలావతి ఆస్పత్రికి హుటాహుటిన తరలించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. పైగా, ఆయనకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో సైతం నెగెటివ్ అని వచ్చింది. 
 
ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని, ఆక్సిజన్‌ పెట్టే అవసరం లేకుండానే ఉండగలుగుతున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆయనను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చినట్లు తెలిపారు. ఒకరోజు అబ్జర్వేషన్‌లో ఉంచుతామన్నారు.
 
కాగా, తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సంజయ్‌దత్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. తన కొవిడ్‌ రిపోర్ట్‌ నెగెటివ్‌ వచ్చిందని, ప్రస్తుతం తాను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోతానని చెప్పారు. తన గురించి ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.