deewali
✕

యాంక‌ర్ ప్ర‌దీప్‌కు క‌రోనా పాజిటివ్‌!

Written By డీవీ
Updated: శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (17:17 IST)
pradeep
క‌రోనా మహ‌మ్మారి ఈసారి చాలా మంది ప్ర‌ముఖుల‌ను ఇంటివ‌ద్ద‌కే ప‌రిమితం చేస్తోంది. తాజాగా యాంక‌ర్‌, న‌టుడు ప్ర‌దీప్‌కు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది తెలిసింది. త‌ను కొద్దిరోజులుగా క్వారంటైన్‌లో వుంటున్న‌ట్లు స‌న్నిహితులు తెలియ‌జేస్తున్నారు. ఈ విష‌య‌మై ఆయ‌న ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే టీవీలో ప‌లు షోల‌లో ఆయ‌న యాంక‌ర్‌గా వున్న‌టువంటివి ముందుగానే చేసిన క‌నుక తాజాగా ఇటీవ‌లే చేసిన  'డ్రామా జూనియర్స్ సీజన్ 5' ప్రోమోలో  ప్రదీప్ కన్పించలేదు. ఆయ‌న స్థానంలో యాంకర్ రవి కనిపించడంతో ఈ వార్త‌కు బలం చేకూరినట్టయ్యింది. కాగా 2020 నుంచి పలువురు బుల్లితెర ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. నవ్య స్వామి, రవికృష్ణ, ప్రభాకర్, సాక్షి శివ, భరద్వాజ్, మాళవిక, సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ తదితరులు కరోనా సోకినవారి జాబితాలో ఉన్నారు.
 
ఇక ప్ర‌దీప్ త‌ను చేసిన 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా! సినిమాలో హీరోగా న‌టించాడు. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఓ యాక్ష‌న్ స‌న్నివేశం చేస్తుండ‌గా చెట్టుపైనుంచి దూకడంతో ఎడ‌మ‌కాలు పాక్చ‌ర్ అయింది. ఆ స‌మ‌యంలో కొద్దికాలం విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్ప‌టికీ ఆ పెయిన్ తాలూకు గుర్తులు క‌నిపిస్తాయి. ఏది ఏమైనా ప్ర‌దీప్ కోలుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

అన్నీ చూడండి

పోలీసులపై తిరగబడిన రాప్తాడు దాడి నిందితుడు... కాల్పుల్లో మృతి?

రాప్తాడు నిందితుడిపై పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు, వీడియో

ఆశ్రయం లేని 5,000 మంది కోసం నీతా ముఖేష్ అంబానీ అనంత ఆశ్రయ్ ప్రాజెక్టుకు నీతా అంబానీ భూమిపూజ

హైదరాబాద్‌లో రూ.200 కోట్లతో తయారీ కేంద్రం ప్రారంభించిన మివి

జ్ఞానేశ్ కుమార్ భూగర్భంలో దాక్కొన్నా బయటకు లాక్కొస్తాం : ఖర్గే హెచ్చరిక

అన్నీ చూడండి

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?

విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం

కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్‌కు చికిత్స

గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు

హెచ్‌సీజీ విశాఖ, ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన

తర్వాతి కథనం
Show comments