శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (12:20 IST)

సంజనా గల్రానీకి కరోనా పాజిటివ్.. స్వీయ రక్షణ చర్యలు పాటించాలి..

శాండల్‌వుడ్‌లో వెలుగుచూసిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో చిక్కిన సౌత్ హీరోయిన్‌ సంజనా గల్రానీ.. ప్రస్తుతం కరోనా వైరస్‌ బారినపడ్డారు. తమిళ, తెలుగు చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ నిక్కీ గల్రానీ సోదరి అయిన సంజనా గల్రానీ.. డ్రగ్స్‌ కేసులో మూడు నెలల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే.
 
ఇటీవలే బెయిల్‌పై ఈమె విడుదలయ్యారు. ప్రస్తుతం ఇంటివద్దే ఉంటున్న సంజనకు హఠాత్తుగా శ్వాససమస్య తలెత్తిందట. దీంతో ఆమెకు కొవిడ్‌ పరీక్ష చేయించగా, పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని సంజన.. తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. 
 
'నాకు కరోనా వైరస్‌ సోకింది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను. నాతో కలిసిన వారందరు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి ఒక్కరూ స్వీయరక్షణ చర్యలు పాటించాలి'.. అని సంజనా గల్రానీ తెలిపింది. కాగా సంజనా ప్రస్తుతం పోడా ముండం అనే చిత్రంలో నటిస్తోంది. ఇక తెలుగులో డార్లింగ్ ప్రభాస్ నటించిన బిజ్జుగాడు సినిమాలో సపోర్టింగ్ రోల్‌లో కనిపించింది.