ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 12 జులై 2017 (06:30 IST)

తెరపైనే రెచ్చిపోతున్నాం.. నిజ జీవితంలో తుస్సే.. : దిశా పటానీ

బాలీవుడ్ హీరో టైగర్ ష్పాఫ్‌తో బాలీవుడ్ నటి దిశా పాటానీ ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఈ అమ్మడు స్పందించింది. నిజం చెప్పాలంటే.. దిశా చేసిన సినిమాల కన్నా యంగ్‌ హీరోతో చేస్తున్న

బాలీవుడ్ హీరో టైగర్ ష్పాఫ్‌తో బాలీవుడ్ నటి దిశా పాటానీ ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఈ అమ్మడు స్పందించింది. నిజం చెప్పాలంటే.. దిశా చేసిన సినిమాల కన్నా యంగ్‌ హీరోతో చేస్తున్న రొమాన్స్‌తోనే దిశా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అయితే, ఎవరెంతగా పుకార్లు పుట్టించినా ఆ హీరోతో తనకున్నది స్నేహం తప్ప మరొకటి లేదని తేల్చి చెప్పింది.


తామిద్దరం ఒకటి రెండు సినిమాలు కలిసి చేసినందుకు మా మీద వస్తున్న పుకార్లు వచ్చాయి. వాటిల్లో ఎంత మాత్రం నిజం లేదు. మా మధ్య ప్రేమే లేనప్పుడు పెళ్ళిదాకా ఎలా వెడతాం? వెండితెర మీద మా రొమాన్స్‌ బాగుందని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అంతేతప్ప నిజ జీవితంలో మా మధ్య ఎలాంటి రొమాన్స్‌ లేదు. ఇద్దరం కెరీర్‌ని ఓ ఛాలెంజ్‌గా తీసుకున్న వాళ్ళం. ఇలాంటి కామన్‌ పాయింట్లు ఇద్దరిలో ఉండడంతో స్నేహం త్వరగా కలిసింది. నేనూ టైగర్‌ ష్రాఫ్‌ మంచి స్నేహితులం మాత్రమే! అంతేకానీ మా ఇద్దరి మధ్య మరో సంబంధం లేదని తేల్చి చెప్పింది. 
 
సోషల్‌ మీడియాలో వస్తున్న మీ ఇద్దరి ఫొటోలపై ఆమె స్పందిస్తూ... అవి నేను పోస్ట్‌ చేసినవే. ఇటీవల నా బర్త్‌డే జరిగింది. ఆ సందర్భంగా నేనూ, టైగర్‌ ష్రాఫ్‌ దిగిన ఫొటోలు అవి. ఆ ఫొటోలలో మాతో పాటు టైగర్‌ సిస్టర్‌ కూడా ఉంది. ఆ విషయం వదిలేసి మా ఇద్దరి గురించే అందరూ అడగడం వింతగా ఉంది. బర్త్‌డే సందర్భంగా జరిగిన పార్టీలో స్నేహితులతో కలిసి ఫొటోలు దిగడం కూడా తప్పేనా అంటూ ఎదురు ప్రశ్నించింది.