మీకేమైనా పిచ్చి పట్టిందా? రష్మిక మందన ఫైర్, ఎందుకు? (video)
సినిమాల్లోనే కాదు సిన్సియారిటీలోను సీనియర్లతో పోటీ పడుతోంది హీరోయిన్ రష్మిక మందన. తెరమీద క్యారెక్టర్ డిమాండ్‌ను బట్టి వయ్యారంగా చేసినా తెరవెనుక మాత్రం గంభీరంగా నడుస్తోందట. సినిమాలను ఒప్పుకోవడమే కాదు అభిమానులను ట్యాకిల్ చేయడంలో కూడా మిస్ ఫర్‌ఫెక్ట్ అనిపించుకుంటోంది రష్మిక. లేటెస్ట్‌గా ఒక విషయంలో ప్రూవ్ కూడా చేసిందట.
మీతోటి తారలు దూసుకువెళ్తున్నారు, మీరేంటి తాబేలులా మెల్లగా అని అడిగితే, మీకేమైనా పిచ్చి పట్టిందా. నా సినిమాలు నా ఇష్టమంటూ దూకుడుగా మాట్లాడుతోందట. ఇన్డివిజువాలిటీని దెబ్బతీస్తే ఊరుకోనని గట్టిగా చెపుతోంది ఈ భామ.
సినిమాల్లోకి సడెన్‌గా వచ్చి సూపర్‌గా క్లిక్ అయిన గ్లామర్ డాల్ జాబితాలో రష్మికా మందన చోటు దక్కించుకుంది. తెలుగులో బిజీగా ఉన్న ఇద్దరు, ముగ్గురు ముద్దుగుమ్మలో ఈ కన్నడ భామ బ్యూటీ పేరు కూడా ఉంది.
గీత గోవిందం మూవీ సక్సెస్‌కి రెడ్ కార్పెట్ పరిచిన విషయాల్లో రష్మిక క్యూట్ లుక్స్‌కు స్పెషల్ చోటు ఉంది. విజయ్ దేవరకొండ పక్కన చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఫిక్సయింది తెలుగు ప్రేక్షక లోకం. అందుకే ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా డియర్ కామ్రేడ్‌లో కూడా అతనితో మెరిసింది అమ్మడు. కామ్రేడ్‌తో కెమిస్ట్రీ ఇంకాస్త గట్టిగా పండింది ఇక్కడ.
బ్యాక్ టు బ్యాక్ అతడితోనే కనిపించేసరికి అతడికి, ఆమెకి మధ్య ఏంటి అంటూ హైపర్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసింది నెటిజనం. అర్జున్ రెడ్డికి, ఈ గీతమ్మకు లంకె పెట్టి ఇష్టారాజ్యంగా ట్రోలింగ్ షురూ కూడా చేసేశారు. ఒక బ్యాచ్ అయితే అడుగు ముందుకు వేసి రష్మిక చిన్నప్పటి ఫోటోలను పోస్ట్ చేసి అన్‌పార్లమెంటరీ పదాలను ప్రయోగించారు. దీంతో కస్సుమంది రష్మిక.
మా ప్రొఫెషన్ మీద మా ఫర్మాన్మెన్స్ మీద సలహాలు, సూచనలు ఇవ్వండి... అంతేతప్ప వ్యక్తిగత జీవితాలను ఎందుకు టచ్ చేస్తారూ అంటూ గట్టిగా పోస్ట్ చేసిందట. ఇదొక్కటే కాదు తన కెరీర్ గ్రాఫ్ విషయంలో ఆమెకు ఉన్న క్లారిటీయే వేరట. సౌత్‌లో వస్తున్న ఆఫర్లను తెలివిగా వాడుకుంటూ బాలీవుడ్ వైపు చూడకుండా నెట్టుకొస్తోందట రష్మిక. ఇప్పుడు ఈమె చేతిలో సరిలేరు నీకెవ్వరు, భీష్మతో పాటు ఒక తమిళ్, ఒక కన్నడ మూవీ కూడా ఉన్నాయట. కాల్షీట్లు అస్సలు ఖాళీ లేవంటూ డియర్ కామ్రేడ్ హిందీ వర్షన్‌లో ఆఫర్ వచ్చినా నో చెప్పేసిందట రష్మిక.