శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (13:05 IST)

పవన్ కల్యాణ్‌పై బిగ్ న్యూస్.. ఏకంగా రూ.60 కోట్ల పారితోషికం

"వకీల్ సాబ్" సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకు రానున్నారు. గతంలో గబ్బర్ సింగ్ సినిమాతో భారీ హిట్ సాధించిన ఈ కాంబో మరో భారీ మూవీ చేసేందుకు రెడీ అయ్యారు.
 
అయితే సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో తెరకెక్కనుంది. ఈ సినిమా దేశభక్తి కథాంశంగా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేపథ్యంలో ఈ సినిమా నుంచి ప్రీ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. 
 
అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అదేంటంటే… ఈ సినిమా కోసం… ఏకంగా రూ. 60 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారట. పాన్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న నేపథ్యంలో భారీగా రెమ్యూనరేషన్ అడిగేశాడట పవన్‌. ఇక అటు నిర్మాతలు కూడా ఓకే చెప్పారట. కాగా.. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే కానుంది.