బిగ్ బాస్ కంటిస్టెంట్ల రెమ్యునరేషన్ ఎంత..?
బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఐదో సీజన్ నడుస్తుండగా, ఇందులో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో కొందరు ప్రేక్షకులకి బాగానే సుపరిచితం కాగా, కొందరి గురించి వారి రెమ్యునరేషన్ గురించి నెటిజన్స్ ఆరాల తీస్తుండగా, అనేక ఆసక్తికర విషయాలు బయటకి వస్తున్నాయి.
సాధారణంగా పాపులారిటీని బట్టి రెమ్యునరేషన్ ఇస్తుంటారు అని అందరికి తెలిసిందే. యాంకర్ రవి,షణ్ముఖ్ జస్వంత్, అనీ మాస్టర్, యాంకర్ లోబో వీరికి పాపులారిటీ ఎక్కువ కాబట్టి వారికి ఒక వారానికి రూ. 2 లక్షల నుండి రూ.5 లక్షల వరకు అందుకుంటున్నారని సమాచారం.
ఇక ఉమాదేవి,సీనియర్ ఆర్టిస్ట్ ప్రియ, గాయకుడు శ్రీరామ్ చంద్ర, లహరి శారీలకు రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు సమాచారం అందుతుంది.
ఇతర పోటీదారులు వీజే సన్నీ, విశ్వ, నటరాజ్ మాస్టర్, సరయు, శ్వేత వర్మ మరియు మరికొంత మంది ఇంట్లో ఉండటానికి వారానికి 40 నుండి 60 వేల రూపాయల వరకు చెల్లిస్తారని సమాచారం.
ఇక షోని హోస్ట్ చేస్తున్న నాగార్జున ఈ సారి ఏకంగా రూ. 12 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.