1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 27 ఆగస్టు 2021 (20:04 IST)

సుడిగాలి సుధీర్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

జబర్దస్త్ చాలామంది నటులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. చాలామందిని సినీపరిశ్రమలోకి తీసుకెళ్ళింది. అడపాదడపా కొంతమంది సినిమాలు చేసినా ఆ తరువాత జబర్దస్త్ షోలోనే ఎక్కువగా సమయం కేటాయిస్తూ వచ్చారు. మరికొంతమంది మాత్రం సినిమాల్లోను ఎక్కువగా నటిస్తున్నారు.
 
అందులో సుడిగాలి సుధీర్ ఒకరు. ఒకవైపు కామెడీ.. మరోవైపు రష్మితో ప్రేమాయణం ఈ రెండు కలిసి సుధీర్ సుడి బాగానే తిరిగింది. ఎప్పుడూ సందడి చేస్తూ కనిపించే సుధీర్‌కు జబర్దస్త్ టీంలోనే అస్సలు శత్రువులు లేరట. 
 
అయితే స్కిట్లలో మాత్రం సుడిగాలి సుధీర్ టీంకే ఎక్కువగా ఇస్తున్నారట. 10 రోజులకే 20 లక్షల రూపాయల రెమ్యునరేషన్ సుధీర్‌కు ఇస్తున్నారట యాజమాన్యం. ఇప్పటివరకు ఉన్న టీంలలో ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారిలో సుధీర్ ఒకరట. 
 
అయితే ఈ విషయాన్ని ఎక్కడా బహిర్గతం చేయవద్దని చాలాసార్లు టీం సభ్యులను కోరాడట సుధీర్. కానీ మిగిలిన టీం సభ్యులు ఉంటారు కదా. వారే సుధీర్ రెమ్యునరేషన్ గురించి చెప్పడం.. అది కాస్త వైరల్ కావడం జరిగిపోయాయి.