శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి

సుడిగాలి సుధీర్‌ని ఇక సుట్టి అని పిలుస్తా.. ముద్దుపేరు పెట్టిన రష్మీ

బుల్లితెర స్టార్లు, సుధీర్, రష్మిల జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెరపై వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ వీరిద్దరు తెర మీద కనిపిస్తే, అమాంతం ఆగి చూసే వాళ్ళున్నారంటే వాళ్ళెంత ప్రభావం చూపించారో అర్థం చేసుకోవచ్చు. తరచుగా వీరిద్దరి మధ్య గిల్లికజ్జాలు నడుస్తుంటాయి. తాజాగా అది ముద్దు పేరు పెట్టుకునేలా చేసింది. యాంకర్ రష్మీ, సుధీర్‌కి ముద్దు పేరు పెట్టింది.
 
ఇక నుండి సుడిగాలి సుధీర్‌ని సుట్టి అనే పేరుతో పిలుస్తానని తెలిపింది. తెలుగు టెలివిజన్‌లో ప్రసారమయ్యే ఒకానొక షోలో ఈ విధంగా వెల్లడించింది. ఆ తర్వాత వీరిద్దరూ ఒక పాటకి స్టెప్పులేసారు. ఇదిలా ఉంటే, తామిద్దరూ తెర మీద మాత్రమే అలా కనిపిస్తామని, కనీసం వాళ్ళిద్దరి మధ్య పెద్దగా స్నేహం కూడా లేదని రష్మి ఇంతకుముందే చెప్పింది.