1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 మే 2021 (13:03 IST)

నటి ప్రియాంకా చోప్రా భర్తకు ప్రమాదం.. గాయాలు

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా భ‌ర్త‌, ప్ర‌ముఖ హాలీవుడ్ గాయ‌కుడు నిక్ జోనాస్‌కు ప్ర‌మాదం జ‌రిగింది. శ‌నివారం రాత్రి షూటింగ్ సెట్‌లో ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ఆయ‌న‌ను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 
 
అయితే గాయాలు పెద్ద‌వేమి కాక‌పోవ‌డంతో డాక్ట‌ర్స్ చిన్నపాటి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. సోమ‌వారం నిక్ త‌న రియాలిటీ షో ది వాయిస్‌లో పాల్గొన‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రియాంక త‌ను క‌మిటైన ప్రాజెక్ట్స్ కోసం లండ‌న్‌లో ఉంది. నిక్ లాస్ ఏంజెల్స్‌లో ఉన్నారు.
 
నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా 2018లో వివాహం చేసుకోగా, ప్రియాంక క‌న్నా నిక్ పదేళ్ళ చిన్న‌వాడ‌న్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ప్రియాంక చోప్రా త‌న ఆటోబయోగ్రఫీ ‘అన్‌ఫినిష్డ్’ పుస్త‌కాన్ని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. మార్కెట్‌లో విడుద‌లైన వారంలోపే ఈ పుస్తకం న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్ల‌ర్స్ లిస్ట్‌లో చేరి.. లెక్కలేనన్ని కాపీలు అమ్ముడుపోయింది.