మహేష్ బాబు-మురుగదాస్ సినిమాకు పరిణీతి చోప్రా హీరోయిన్ కాదట.. రకుల్ ప్రీత్ సింగట?!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు, ఏ ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల చివరి నుంచి సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ సిని
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు, ఏ ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల చివరి నుంచి సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రాను ఎంపిక చేసినట్టు నిన్నటి వరకు వార్తలు తెగ హల్‌చల్ చేశాయి. ఇందుకోసం ఆ భామకు మూడున్నర కోట్ల రూపాయలు ముట్ట చెప్పారనే టాక్ కూడా టాలీవుడ్‌లో వినిపించింది.
అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఏమైందో ఏమోగాని పరిణితి పేరు మారిపోయింది. ఆమె స్థానంలో టాలీవుడ్ లక్కీ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తోంది. ఇక రకుల్ ఎప్పటి నుంచో మహేష్ సరసన నటించే ఛాన్స్ కోసం ఎదురు చూస్తోందన్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవం సినిమాలో ఆమెకు ఈ ఆఫర్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఆ టైమ్‌లో ఆమె ఫుల్ బిజీగా ఉండడంతో రకుల్ ఛాన్స్ కాజల్‌కు దక్కింది.
ప్రస్తుతం జోరుగా హీరోయిన్లలో ఈ అమ్మడు మహేష్‌కి జోడీగా బాగుంటుందని, పైగా మురుగదాస్ కథకు ఆమె సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతో రకుల్‌నే ఎంపిక చేశారు. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయమై ఆమె, ప్రొడ్యూసర్ల మధ్య డీల్ ఓకే అయ్యిందట. రకుల్ రూ.1 కోటి పారితోషికం డిమాండ్ చేయగా, అంతమొత్తం ఇచ్చేందుకు మేకర్స్ కూడా ఓకే చెప్పారట. ఈ మూవీ నుంచి తప్పుకున్న పరిణీతికే రూ.3.5 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డ నిర్మాతలకు.. రకుల్‌కి కోటి ఇవ్వడం పెద్ద లెక్కేం కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
అంతేకాదు ఈ మూవీకి ''వాస్కోడిగామా'' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఎస్.జే.సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది వేసవి సెలవుల కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.