Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌చ‌ర‌ణ్‌కు శంక‌ర్‌కు ఎలా సెట్ అయిందంటే!

Updated: శనివారం, 13 ఫిబ్రవరి 2021 (21:38 IST)
Sankar, Chirajvee, Robo
రామ్‌చ‌ర‌ణ్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో సినిమా. అందులోనూ దిల్‌రాజు నిర్మాత అన‌గానే అనూహ్య‌మైన స్పంద‌న టాలీవుడ్ లో నెల‌కొంది. క్రేజీ కాంబినేష‌న్ అంటూ దిల్‌రాజు వ‌ల్లే ఇది సాధ్యం అంటూ ఫిలింన‌గ‌ర్ సిని ప్రియులు గొప్ప‌గా చెప్ప‌కుంటున్నారు. అయితే వీరి  కాంబినేష‌న్ కు ముందు చాలా తంతే జ‌రిగింద‌ని తెలుస్తోంది.

అప్పుడెప్పుడో ర‌జ‌నీకాంత్ రోబోకు శంక‌ర్ హైద‌రాబాద్ వ‌చ్చాడు. ఆ వేడుక‌లోనే ఆ తర్వాత శంకర్‌తో నేరుగా పని చేయాలని చిరు అనుకున్నారు. చాలాసార్లు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. రోబో స‌మ‌యంలోనూ జ‌రిగింది. ఆ సినిమా వేడుక‌లో చిరంజీవి హాజ‌ర‌యి శంక‌ర్‌తో ప‌నిచేయాల‌నుంద‌ని కోరిక‌ను వ్య‌క్తం చేశాడు కూడా. ఈలోగా శంక‌ర్ త‌మిళ సినిమాల్లో బిజీగా వుండ‌డంతో కుద‌ర‌లేదు.

మ‌ర‌లా రోబో 2.0 స‌మ‌యంలోకూడా శంక‌ర్ హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు మ‌ర్యాద‌పూర్వ‌కంగా చిరంజీవిని క‌ల‌వ‌డం విశేషం. అప్పుడే చిరంజీవి, శంక‌ర్ కాంబినేష‌న్లో సినిమా వుంటుంద‌ని ఊహాగానాలు వ‌చ్చాయి. కానీ మ‌ర్యాద‌పూర్వ‌కంగానే క‌లిసిన‌ట్లు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. క‌ట్ ‌చేస్తే ఇన్నాళ్ళ‌కు రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్ సెట్ట‌యింది. ఇప్ప‌టికే ఆర్‌.ఆర్‌.ఆర్‌. షూటింగ్‌ ప‌నిలో వున్న రామ్‌చ‌ర‌ణ్‌కు శంక‌ర్ కాంబినేష‌న్ క్రేజ్ తెచ్చిపెట్టింది.

అన్నీ చూడండి

హాస్టల్ వార్డెన్ ఎంత పని చేసింది.. పెళ్లికి విద్యార్థినులను తీసుకెళ్లి.. డ్యాన్స్ చేయించింది..

ఆటోరిక్షాను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. పల్నాడులో ఏడుగురు మృతి

నేపాల్ - చైనా సరిహద్దుల్లో ఆకస్మిక వరదలు.. 160 మంది మృతి

నేపాల్ ఫ్లాష్ ప్లడ్‌కి కారణం హిమ గిరుల్లో 4.4 తీవ్రతో ఏర్పడిన భూకంపమే, ఐసు కొండ బద్ధలైంది

ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు: లుమారాతో యాక్సిస్ ఎనర్జీ భాగస్వామ్యం

అన్నీ చూడండి

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి

ఎంజీఎం కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో బ్రెస్ట్ కేన్సర్‌‍కు అధునాతన చికిత్స

హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?

ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?

సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్‌స్టిట్యూట్‌

తర్వాతి కథనం
Show comments